Cricket | ఆఖ‌రి ఆట‌లో గెలుపెవ‌రిదో?

Cricket | ఆఖ‌రి ఆట‌లో గెలుపెవ‌రిదో?

  • నేడే సౌతాఫ్రికాతో భారత్ ఐదో టీ20
  • సిరీస్ డిసైడ్ మ్యాచ్‌
  • అహ్మదాబాద్‌లోని మోడీ స్టేడియంలో రాత్రి 7గంటలకు ఆరంభం

Cricket | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ చివరి టీ20 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Stadiam) జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్‌ గెలిచే అవకాశాలు లేవు. ప్రస్తుతం సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ టీ20 మ్యాచ్‌లో గెలిచి టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తుండగా.. దక్షిణాఫ్రికా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని చూస్తుంది. ఇదిలా ఉండగా ప్రాక్టీస్ సమయంలో గాయపడిన వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నాలుగో టీ20కి అందుబాటులో ఉండడని ముందే ప్రకటించారు. గిల్‌ జట్టుతో పాటు అహ్మదాబాద్‌కు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Cricket

మరోవైపు, సంజూ శాంసన్‌ను డగౌట్‌కే పరిమితం చేస్తూ వరుసగా విఫలమవుతున్నగిల్‌కు ప్రతి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గిల్‌ స్థానంలో సంజూ శాంసన్‌ను (Sanju Samson) ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో కీలకమైన టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ ఫామ్‌ ఆందోళన కలిగిస్తుంది. సారథిగా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ, వ్యక్తిగత బ్యాటింగ్‌ ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇటీవల వరుసగా భారీ ఇన్నింగ్స్‌ను ఆడడంలో సూర్య విఫలమవుతున్నాడు. ప్రస్తుతం టీమిండియాకు సూర్య ఫామ్‌ ఆందోళన కలిగిస్తుంది.

ఇక ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో (Match) ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నందున భారత జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఇద్దరూ రాణించారు. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా నాలుగో మ్యాచ్‌కు ముందు జట్టులో చేరాడు.

Cricket

మరోవైపు ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నిలకడ లోపించడం దక్షిణాఫ్రికా జట్టును వేధిస్తోంది. చివరి మ్యాచ్‌లో అయినా సమష్టి ప్రదర్శనతో భారత్‌ను ఎదుర్కోవాలని ప్రోటీస్‌ జట్టు భావిస్తోంది. ఓపెనర్‌ రీజా హెన్‌డ్రిక్స్‌ వరుసగా విఫలమవుతుండటంతో కెప్టెన్‌ (Captain) ఐడెన్‌ మార్‌క్రమ్‌ ఆ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. మరో ఓపెనర్‌ డికాక్‌ రెండో మ్యాచ్‌లో శతకంతో మెరిశాడు. అతడు పూర్తి ఫామ్‌లోకి వస్తే భారత బౌలర్లకు గట్టి సవాల్‌గా మారే అవకాశముంది. అయితే, హిట్టర్లు బ్రెవిస్‌, మిల్లర్‌ ఈ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
పేస్‌ ఆల్‌రౌండర్‌ యాన్సెన్‌ బౌలింగ్‌లో పరవాలేదనిపిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన మెరుపులు చూపడం లేదు.

ఇరు జట్ల అంచ‌నా
భారత జట్టు : అభిషేక్‌, గిల్‌/శాంసన్‌, సూర్య కుమార్‌ యాదవ్ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, దూబే, హర్షిత్‌/సుందర్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌.

దక్షిణాఫ్రికా జట్టు : డికాక్‌, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), హెన్‌డ్రిక్స్‌, బ్రెవిస్‌, మిల్లర్‌, ఫెరీరా, యాన్సెన్‌, బాష్‌, లిండే/నోకియా, ఎన్‌గిడి, బార్ట్‌మన్‌.

CLICK HERE TO READ  20న జట్టు ప్రకటన..

CLICK HERE TO READ MORE

Leave a Reply