CRICKET | వైజాగ్‌లో వన్డే మ్యాచ్
- సౌతాఫ్రికాతో టీమిండియా ఢీ
- ఏర్పాట్లను పరిశీలించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్..
CRICKET | ఆంధ్రప్రభ, విశాఖపట్నం : ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వైజాగ్ (VIZAG) ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం జరగబోయే మూడు వన్డేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ అన్నారు. ఈ రోజు వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌కి సంబంధించిన ఏర్పాట్లును ఏసీఏ సెక్రటరీ సానా సతీష్, వైస్ ప్రెసిడెంట్ , ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ బండారు నర్సింహారావు, కోశాధికారి దండమూడి శ్రీనివాసరావు, ఏసీఏ కౌన్సిలర్ విష్ణు దంతు, ఏసీఏ స్టేడియం చైర్మన్ ప్రశాంత్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సీవోవో గిరీష్ డోంగ్రే, ఏసీఏ సీఏవో జై కిషన్‌లతో శుక్రవారం సాయంత్రం ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. స్టేడియం మొత్తం తిరిగి ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు.

