Bikkanoor | తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి (Rameshwar Palli) గ్రామంలో బుధవారం తండ్రి దహన సంస్కారాలు కూతురు నిర్వహించారు. గ్రామానికి చెందిన సామ వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.
ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. చదువుల నిమిత్తం కొడుకు అచ్యుత రెడ్డి (Achyuta Reddy) లండన్ దేశంలో ఉన్నారు. తండ్రి మృతిచెందిన విషయం కొడుకుకు సమాచారం అందించగా.. సకాలంలో ఆయన రాలేకపోయారు. దీంతో మృతుని కూతురు హారిక (Harika) దహన సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి కూతురు నిప్పు అంటించడంతో అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.

