పటాన్ కోట – పఠాన్కోట్ (Patankota )వైమానిక దళ కేంద్రం (air base) నుంచి బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు (Technical ) ఎదురయ్యాయి.. దీంతో ముందుజాగ్రత్తగా పటాన్ కోట సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా ల్యాండ్ (crash) చేశారు . హెలికాప్టర్ దిగుతున్నట్లు చూసిన గ్రామస్థులు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని వైమానికి దళం ఒక ప్రకటనను విడుదల చేసింది.
Crash Landing | అపాచీ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం – పటాన్ కోటలో అత్యవసర ల్యాండింగ్
