ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్లో మర్యాదపూర్వక భేటీ..

ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్లో మర్యాదపూర్వక భేటీ..
- సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్యకు అభినందనలు…
- పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువ…
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాలకోటయ్యను మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ కూడా పాల్గొని బాలకోటయ్యకు అభినందనలు తెలియజేశారు. సామాజిక సంక్షేమ రంగంలో మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, బాధ్యతలు స్వీకరించిన బాలకోటయ్యకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.

