Court | హ‌త్య‌ను నిర‌సిస్తూ….

Court | హ‌త్య‌ను నిర‌సిస్తూ….

Court | ఉట్నూర్, ఆంధ్రప్రభ : న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలనీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. అత్తపూర్ కోర్టు బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది మహ్మద్ ఖధీర్ హత్యను నిరసిస్తూ ఉట్నూర్ బార్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో సోమవారంకోర్టువిధులుబహిష్కరి0చారు.

అనంతరం న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలు ధరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులుమాట్లాడుతూ… ఖధీర్ హత్యలో పాలుపంచుకున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకొని ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బానోత్ జగన్ నాయక్,ప్రధాన కార్యదర్శి బి. జైవంత్ రావున్యాయవాదులు జమీర్ ఖాన్, ధీరజ్ గుప్తా, చింతల గిరి, కురివేత శ్రీనివాస్, పవార్ వసంత్ రావు, కుడెల్లి అశోక్, నాతరి రాజు, విశాల్ జాదవ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply