Court | ఆదిత్యుని సన్నిధిలో హై కోర్టు న్యాయమూర్తి
Court | శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ): అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఏపీ హై కోర్ట్ (AP High Court) న్యాయమూర్తి రవి నాథ్ తిల్హరి దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె .వి డి వి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించారు.వారికి స్వామి వారి ప్రసాదాలను,చిత్రపటం అందజేశారు.

