counting | ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి..

counting | ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి..

  • నూతన ఓటర్లకు, మహిళలకు సన్మానం
  • యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

counting | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు(right to vote)ను ఉపయోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెంలో జరుగుతున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు గ్రామాన్ని సందర్శించి మహిళలు అందంగా ముస్తాబు చేసిన పర్యావరణహిత పోలింగ్ కేంద్రం(polling stations)ను ప్రారంభించారు.

పోలింగ్ కేంద్రంలో అందంగా తయారు చేసిన మహిళల(women)ను, నూతనంగా ఓటు హక్కు వినియోగించుకున్న యువతీ, యువకులను అభినందించారు. మండల తహసీల్దార్ వీరాబాయితో పాటు మహిళలను, నూతన ఓటర్లను కలెక్టర్ సన్మానించారు. “నేను ఓటేశాను మీరు?” కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల పోలింగ్, కౌంటింగ్(counting)ను ప్రశాంతంగా నిర్వహించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్టిఓ శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి(ACP Patolla Madhusudhan Reddy), ఎంపీడీవో సందీప్ కుమార్, మండల తహసీల్దార్ వీరాబాయి, ఇన్స్పెక్టర్ మన్మధకుమార్, ఆర్ ఐ కొప్పుల సుధాకర్ రావు తదితర అధికారులు, ఎన్నికల సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు.

Leave a Reply