Counter | ఐఎఎస్ లు దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుముక …. రేవంత్ వ్యాఖ్యలపై కెటిఆర్ ఫైర్
ఎక్స్‌లెన్స్ ఇన్ యాక్షన్
ఏసీ అండ్ ఇనాక్షన్ కాదు
ఐఏఎస్‌లను చులకన చేయొద్దు
సీఎం రేవంత్ మాటలు సరికాదు
దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుముక వారే
పచ్చకామెర్ల వాడికి.. అన్నట్టుంది మీ వాలకం
అందరూ అదే దందా చేస్తారనుకుంటే ఎట్లా?
రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అదికారులు దేశ ప్రజాస్వామ్య విధానానికి వెన్నెముక, సివిల్ సర్వెంట్ల నినాదం ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్.. ఏసీ అండ్ ఇనాక్షన్ కాదని కేటీఆర్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. “పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని, అందరూ మీ లాగానే బ్లాక్‌మెయిల్ దందాలు చేస్తారని సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తూ బతుకుతున్నారని అనుకోవడం తప్పు అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎక్స్‌లెన్స్ ఇన్ యాక్షన్..
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముక. సివిల్ సర్వెంట్ల నినాదం ‘ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్స… అంతేకానీ, ‘ఏసీ అండ్ ఇనాక్షన్’ కాదని కేటీఆర్ అన్నారు. వారి గురించి సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు కించపరిచేలా, అమర్యాదకరంగా ఉన్నాయని, బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ప్రతిష్టను నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు.