చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ లో చిట్యాల ఎస్సై సతీష్,

​చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో రౌడీ షీటర్లు చట్టవ్యతిరేక, కార్యకలాపాల్లో పాల్పడితే కఠిన చర్యలు, తప్పవని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఎస్సై రౌడీ షీటర్లు తమ పాత నేర ప్రవృత్తిని విడనాడి, సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని ఆదేశించారు.

ఎలాంటి చట్టవ్యతిరేక , అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని గొడవలకు దిగకూడదని స్పష్టం చేశారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ నేరాలకు పాల్పడినా, చట్టాన్ని ఉల్లంఘించిన కఠిన చర్యలు తప్పని ఎస్ఐ సతీష్ హెచ్చరించారు

Leave a Reply