హోలీ సంబరాలలో పాల్గొన్న మనోహర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 18వ వార్డు కౌన్సిలర్ గా భారీ విజయం సాధించిన బుడ్డా సురేష్, బూత్ కమిటీ సభ్యులు మంగళవారం బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు, పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సురేష్ ను గంగిడి మనోహర్ రెడ్డి అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం హోలీ సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కంచర్ల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
