Corporation | కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి…

Corporation | కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి…

  • గౌడవెల్లి పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం….

Corporation | మేడ్చల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో భాగంగా గుండ్ల పోచంపల్లి డివిజన్ గౌడవెల్లి పట్టణంలో ఈరోజు ఉదయం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గోమారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను శాంతియుతంగా దహనం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ జిహెచ్ఎంసి గౌడవెల్లి లో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసనలలు తెలియజేశారు.

ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ అప్పమ్మ గారి జగన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతి పిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ని సిట్ విచారణ కు పిలవడం అత్యంత దుర్మార్గం అన్నారు. తెలంగాణ సాధించిన కెసిఆర్ 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత లు చేపట్టి, స్వరాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దారని, దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చారని ,ఆ మహానేతకు సిట్ నోటీసులు జారీ చేయడం శోచనీయమని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరాజు, సుదర్శన్ రెడ్డి, సంతోష్ భాను, సదానంద్, రాజగోపాల్ రెడ్డి, యుగపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply