ఏసీబీ వలలో భారీ తిమింగలం…!

రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా సహకార అధికారి…!


ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి నుండి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు నాయక్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పిఎసిఎస్ సెక్రటరీ వెంకటేశ్వర్ గౌడ్ గతంలో సస్పెన్షన్ కు గురైన వేతన బకాయిలకు సంబంధించి బిల్లులు మంజూరు చేసే విషయంలో జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ ను ఆశ్రయించాడు.

పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటే రూ. 7 లక్షలు ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశారు. మంచిర్యాలలోని ఇక్బాల్ నగర్ క్యాంప్ ఆఫీసులో ఒప్పందం ప్రకారం మొదటి విడతగా వెంకటేశ్వర్ గౌడ్ రూ. 2 లక్షలు లంచం ఇస్తుండగా మంచిర్యాల ఏసీబీ అధికారులు వల పని పట్టుకున్నారు. జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు నాయక్ పై విచారణ జరిపిస్తున్నారు.

Leave a Reply