బీడీ కార్మిక సమస్యలపై నిరంతర పోరాటం….

బీడీ కార్మిక సమస్యలపై నిరంతర పోరాటం….

బిక్కనూర్, ఆంధ్రప్రభ : బీడీ కార్మిక సమస్యలపై నిరంతర పోరాటం చేయడం జరుగుతుందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సందుగారి రవీందర్ రెడ్డి(Sandugari Ravinder Reddy) చెప్పారు. ఈ రోజు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నారని చెప్పారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షల పేరుతో బీడీ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలో జీవన భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటివరకు అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

బీడీ కార్మికుల సమస్యలపై ఈనెల 7న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. బీడీ కార్మికులు, పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాల వద్దకు తరలిరావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లచ్చయ్య, ప్రతినిధులు ప్రసాద్, రేణుక తదితరులు ఉన్నారు.

Leave a Reply