చేపట్టనున్న మ్యాజిక్ డ్రైన్‌ల నిర్మాణాలు..
నల్లగొండ జిల్లా, గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండలంలోని తేరటుపల్లి, గట్టుప్పల గ్రామాలలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిKomatireddy Rajagopal Reddy) ఆదేశాల మేరకు నూతన విధానంతో నిర్మించనున్న మ్యాజిక్ డ్రైన్ మురికి కాలువలను పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్, మునుగోడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు(Nageswara Rao)తో కలిసి మండల కేంద్రంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి అనువైన మురికి కాలువలను ఈ రోజు పరిశీలించారు.
ఈ ఆధునిక పద్ధతిలో మురికి కాలువల నిర్మాణం ప్రతి నీటి బొట్టు భూమిలో ఇంకుతుందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, మురుగు నీటీ నిల్వ సమస్యలు తగ్గుతాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ముందుగా గట్టుప్పల మండలంలో తేరటుపల్లి, గట్టుప్పల(Theratupalli, Gattuppala), మునుగోడు మండలంలో పులిపలుపుల, నాంపల్లి మండలంలో దామెర, చండూరు మండలంలో ఇడికూడ, మర్రిగూడ మండలంలో కుదాబాక్షుపల్లిలో మ్యాజిక్ డ్రైన్(Magic Drain) నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. వీరి వెంట ఏఈ ఉదయ్, ఏఈ హరి, ఏఈ సతీష్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి షఫీ, యిడం గణేష్, పగిళ్ల యాదయ్య, బాణావత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.