Congress | ఓటమిని గెలుపుగా మార్చిన కాంగ్రెస్ వ్యూ హం..

Congress | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఇందూరు ప్రజల్లో ఎవరి నోట విన్న ఇందూర్గడ్డపై కాషాయం జెండా ఎగిరే నా.. కాంగ్రెస్ జెండా ఎగిరే నా అనే మాట వినిపి స్తుం ది. ఇందూర్ లో రాజ కీ యం రసవత్తరంగా మా రింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతుంది. పక్క వ్యూహరచనతో కాంగ్రెస్ ముందుకెళ్తుంది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ వ్యవహారంపై చిక్కు ముడి వీడడంతో కాంగ్రెస్ కు కలిసొచ్చింది. కాంగ్రెస్ మేయర్ పీఠం కైవ సం చేసుకొనుంది. నిజా మాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 17 స్థానా లకి పరిమితమైన కాంగ్రెస్ టిపిసిసి నాయకత్వంలో నగరంలో తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిన ప్పటికీ .. గెలుపుగా మా ర్చుకునేలా గట్టి వ్యూహర చనను రూపొం దిస్తుంది. ఎంఐఎం తో పొత్తుతో కీలక మంత నాలు చేస్తూ మేయ ర్ పీఠం కైవసం చేసుకోనుంది.
మ్యాజిక్ ఫిగర్ సాధన:
కాంగ్రెస్ గెలుచుకున్న 17 స్థానాలకు తోడు, ఎంఐ ఎంకు చెందిన 14 మంది కార్పొరేటర్ల మద్దతును కూడగట్టడంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ కలయికతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం కాంగ్రెస్కు సునాయా సమైంది.
తెరపైకి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి?
నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. మేయర్ పీఠం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ, సామాజిక సమీకరణాలు ,రాజకీయ చతురతతో కాంగ్రెస్ పా వులు కదుపుతోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షు డు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తూ, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెంది న 49వ డివిజన్ కార్పొరే టర్ కూరగాయల ఉమా రాణికి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.?
నిజామాబా దులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయ డమే లక్ష్యంగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేస్తు న్నారు. 19వ డివిజన్ నుండి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సమంత ఓటమి పాలవ్వడం కాంగ్రె స్ శ్రేణులను కొంత నిరాశ కు గురిచేసిన ప్పటికీ, మహేష్ కుమార్ గౌడ్ ఆ ఓటమిని ఏమాత్రం కుంగ దీయకుండా ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషిం చారు. బిసి సామాజిక వర్గాల్లో అత్యంత బలమైన ముదిరాజ్ వర్గానికి మేయర్ పదవి కట్టబెట్టడం ద్వారా నగరం లో పార్టీకి తిరుగులేని మద్దతు లభిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తు న్నారు.
49వ డివిజన్ కార్పొరేటర్ గా కూరగా యల ఉమారాణికి ఉన్న సామాన్య నేపథ్యం, ప్రజల తో ఆమెకున్న మమేక త్వం ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్. జిల్లా రాజ కీయాలపై పట్టున్న మహే ష్ కుమార్ గౌడ్, ఉమా రాణి పేరును అధిష్టానం వద్ద బలంగా ప్రతిపాదిస్తు న్నట్లు తెలుస్తోంది. నగర అభివృద్ధిలో తన సొంత ముద్ర వేయాలని భావిస్తు న్న ఆయన, ఉమారాణి వంటి అంకితభావం గల నాయకురాలిని ప్రోత్సహిం చడం ద్వారా ఇటు సామా జిక న్యాయాన్ని, అటు రాజకీయ లబ్ధిని పొందా లని చూస్తున్నారు.
ఎంఐఎం మద్దతుతో కొత్త అధ్యాయం
కాంగ్రెస్ (17) మరియు ఎంఐఎం (14) కలయికతో ఏర్పడబోయే ఈ కొత్త సమీకరణం నిజామా బాదు రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానుం ది. మహేష్ కుమార్ గౌడ్ సమన్వయకర్తగా వ్యవ హరిస్తూ, అందరినీ కలు పుకొని పోయేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తున్నాయి.సమంత ఓటమి వంటి చేదు అను భవాలను పక్కన పెట్టి, భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ఉమారాణిని తెరపైకి తేవడం మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ పరిణతికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
