Congress | నియోజకవర్గాల పెంపు

Congress | నియోజకవర్గాల పెంపు

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
ప్రధానిమోదీకి లేఖ

Congress | న్యూఢిల్లీ- ఆంధ్రప్రభ : రాజకీయ లబ్ధి కోసమే నియోజకవర్గాల పెంపును చేపడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమ‌ర్శించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పార్లమెంట్ నిర్వహించే సమయంపై ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ లబ్దికోసం తొందర పడుతున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ ను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ఖర్గే ప్రశ్నించారు. రాష్ట్రాలలో ఎన్నికల కొనసాగుతుండగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన పై చర్చ జరగకుండా ఎలా ముందుకు వెళ్తారని అన్నారు. ఏప్రిల్ 29న ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఖర్గే డిమాండ్ చేశారు.

Leave a Reply