చేయూతనిచ్చి చేతి గుర్తును గెలిపించండి..

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో తనకు చేయూతనిచ్చి అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్ గా గెలిపించాలని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్వతి విజయ ఓటర్లను కోరారు.పుర ఎన్నికల్లో 13వ వార్డు నుంచి బర్లో దిగుతున్న ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా రాం నగర్ లో ప్రచారం నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ కాంగ్రేస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.కాంగ్రెసు ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు, ఇంటింటికి 200 ఉచిత విద్యుత్ అందిస్తుందని,చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాల ప్రజలకు వివరించారు. చేయూతనిచ్చిన చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి వైపు తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు.కాగా కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్వతి విజయ ను స్వాగతిస్తూ హారతు ఇచ్చారు.
