Congress Party | ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

Congress Party | ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

Congress Party | చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముఖ్య అథితిగా హాజరై గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర‌ సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ కీల‌క పాత్ర పోషించింద‌న్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించిన కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాల సంక్షేమనికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్న సూర్యనారాయణ, హేమవంత్ రెడ్డి, భాషీర్ బాబుఖాన్, పాతర్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply