నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు..

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతుని పార్టీవదేహానికి కాంగ్రెస్ నాయకులు నివాళ్ళు అర్పించారు. పరకాల మున్సిపల్ పరిధిలోని 13 వ వార్డులో బొచ్చు మధు అనారోగ్యం మృతి చెందగా శుక్రవారం రోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, డాక్టర్ మడికొండ శ్రీను సందర్శించి, పూలమాలలువేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొచ్చు భాస్కర్, కోడెపాక రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
