8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జుట్ల అనిత గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 8వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన జుట్ల అనిత విజయం సాధించారు. కాంగ్రెస్ బిజెపి మధ్య పోరావోరుగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థికి 582 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి సుజాతకు 460 ఓట్లు లభించాయి. అదేవిధంగా బిఆర్ఎస్ అభ్యర్థికి 222 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జుట్ల అనిథ 122 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
