CONGRESS | పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు

CONGRESS | పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు

  • కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జినుకల రమేష్

CONGRESS | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : పార్టీ నిబంధనలను ఉల్లంఘింస్తే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన సూచనలకు, పార్టీ నిర్ణయాలకు ప్రతి నాయకుడు, కార్యకర్త కట్టుబడి ఉండాలని, పార్టీ క్రమశిక్షణను పాటించడం తప్పనిసరని పేర్కొన్నారు.

నర్సింహులపేట సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండాల బిక్షం, పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఆయనను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, అధిష్ఠానం నిర్ణయం మేరకు యాకయ్యను అధికారిక అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు రమేష్ స్పష్టం చేశారు.

అధికారిక అభ్యర్థికి విరుద్ధంగా ప్రచారం చేయడం సబబు కాదని, డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఆదేశాల మేరకు అందరూ పనిచేయాలని కోరారు. అధికారిక అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని రమేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్, వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేముల జైపాల్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహబూబ్ ఖాన్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు దశ్రు నాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు వెంకన్న, సీనియర్ నాయకులు అల్వాల శ్రీనివాస్, సర్పంచ్ అభ్యర్థి పెదమాముల యాకయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జి చిర్ర సతీష్, గూగులోతు రాజేందర్, కాస యాకయ్య, ఎర్ర రవి, దూరు యాకయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply