Congress | పొనకల్ వాడల్లో ఇంటింటా విస్తృత ప్రచారం
సర్పంచి అభ్యర్థిని గెలిపించాలని వినతి
Congress | జన్నారం,నవంబర్ 6 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచి కాంగ్రెస్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్ తోపాటు నేతలు శనివారం మధ్యాహ్నం విస్తృతంగా ప్రచారం చేశారు. తమ సర్పంచి అభ్యర్థిని గెలిపించినట్లయితే స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ సహకారంతో అపరిస్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.సర్పంచి అభ్యర్థిని గెలిపించినట్లయితే పంచాయతీలోని వాడల్లో నేతలంతా ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.వాడల్లో మహిళలచే ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్,గ్రామ మాజీ సర్పంచి జక్కు భూమేష్ గుప్తా, టౌన్ అధ్యక్షుడు రమేష్,నేతలు ఇసాక్, చంద్రశేఖర్, శంకర్, సుధీర్, రాజేష్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు.

