Congress | అభివృద్ధి, సంక్షేమం నా ఎజెండా…

Congress | అభివృద్ధి, సంక్షేమం నా ఎజెండా…


ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తా….
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీట కోడూర్ సంపత్


Congress | ఆంధ్రప్రభ, లింగాల గణపురం : గ్రామాభివృద్ధి సంక్షేమమే నా ఎజెండా అని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిటకోడూరు సంపత్ అన్నారు. శనివారం లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామంలో పెద్ద కార్యకర్తలు అభిమానులు ఇంటింటా వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.

ఈసందర్భంగా సర్పంచ్ అభ్యర్థి చీటకోడూరు సంపత్ మాట్లాడుతూ… ప్రజా పాలన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను గ్రామానికి తీసుకురావడమే త‌న లక్ష్యమని, ఓటర్లు ఈ సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా ఆశీర్వదించి గెలిపిస్తే అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బర్ల కుమార్, మాజీ సర్పంచ్ బసవ గాని ఉపేందర్ శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు ఎంగలి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బస్సు గాని అనిల్ సంజీవ, బీరయ్య, వార్డు సభ్యుల అభ్యర్థులు బండ్రు బీరయ్య, కాలే వెంకటేష్, దుర్గి రేణుక, దుబ్బాక అనిత, బసవ గాని విటల్ బసవ గాని అంజమ్మ, కొత్త వినోద్ కీసరి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply