Congress | మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న

Congress | మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న
Congress | మోత్కూర్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 వ వార్డు కౌన్సిలర్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య , వైస్ చైర్మన్ గా 1 వ వార్డ్ కౌన్సిలర్ పల్లెర్ల వెంకన్న లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రత్యేక సమావేశం, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఎన్నికల ప్రత్యేక అధికారి డి ఆర్ డి ఏ ఏపీ డి గుర్రం సురేష్ సమక్షంలో 12 మంది కౌన్సిలర్లు గా ప్రమాణ స్వీకారం చేశారు .అనంతరం చైర్మన్ గా స్వప్న సోమ నర్సయ్య, వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న ల చేత ఎన్నికల ప్రత్యేక అధికారి స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు.
చైర్మన్, వైస్ చైర్మన్, నూతన పాలకవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే మందుల సామెల్
నూతన మున్సిపల్ చైర్మన్ స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న తో పాటు కౌన్సిలర్లను మందుల సామెల్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. పార్టీలకతీతంగా మోత్కూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పరిచేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. మోత్కూర్ మున్సిపాలిటీని సుందర నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు. మోత్కూర్ లో బృందావన్ కాలువ మరమ్మత్తులు, పెద్ద చెరువులోకి డ్రైనేజీ నీరు వెళ్లకుండా శుద్ధికరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ,సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానన్నారు.


