CONGRESS | అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ

CONGRESS | అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ

  • 10 ఏళ్లలో అభివృద్ధిని విస్మరించిన కేసీఆర్ సర్కార్
  • రామగుండంలో త్వరలో 800 మెగావాట్ ప్లాంట్
  • ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల బీమా
  • డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క
  • త్వరలో సింగరేణి స్థలాలకు పట్టాలు : శ్రీధర్ బాబు
  • కాలేశ్వరంతో కేసీఆర్‌కు కమిషన్లు : పొంగులేటి

CONGRESS | గోదావరిఖని, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యమని.. పేదల ప్రభుత్వమని.. అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతూ తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అధ్యక్షతన జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.

పేద మధ్యతరగతి కుటుంబాలు సంతృప్తి చెందడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భ‌ట్టివిక్ర‌మార్క అన్నారు. 22,500 కోట్లతో నిర్మాణం చేసిన ఇందిరమ్మ ఇళ్ళను లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. 96 లక్షల కుటుంబాలకు రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రామగుండంలో అతి త్వరలోనే ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందన్నారు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని భ‌ట్టి మండిపడ్డారు. సింగరేణి (Singareni) కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమాను అమలు చేస్తున్నామని… అదేవిధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోటి రూపాయల ప్రభుత్వ బీమాను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి బొగ్గు పరిశ్రమను కచ్చితంగా కాపాడుకుంటామని నొక్కి చెప్పారు.

CONGRESS

CONGRESS | త్వరలోనే సింగరేణి స్థలాలకు పట్టాలు : మంత్రి శ్రీధర్ బాబు

సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియా వ్యాప్తంగా కంపెనీ స్థలాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి అతి త్వరలోనే ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేస్తూ పట్టాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇండ్ల కోసం ప్రదక్ష‌ణలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇప్పిస్తున్నామని చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, దుకాణ సముదాయాలు కోల్పోయిన బాధితులందరికీ న్యాయం చేసే బాధ్యత తనదన్నారు. అందరికీ ఇండ్ల స్థలాలు పరిహారం చెల్లింపులు జరుగుతాయ‌న్నారు. మున్సిపల్ (Muncipal) ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేతకాక రాజకీయాలు చేస్తుందని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలను వక్రీకరిస్తే సహించమని ధ్వజమెత్తారు.

CONGRESS

CONGRESS | కమీషన్ల కోసమే కాళేశ్వరం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అభివృద్ధి చేయడం చేతకాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో (Project) కేసీఆర్ కమిషన్లను మాత్రం పొందగలిగాడని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. సొంత ఇంటి చిచ్చును పరిష్కారం చేసుకోలేక పోయిన కేసీఆర్ ప్రగల్బాలు పలకడం మానుకోవాలన్నారు. ఇంటి ఆడపడుచు సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నాడు కానీ.. రాష్ట్ర మహిళల సమస్యలు పరిష్కరిస్తానని కేసీఆర్ చెప్ప‌డం హాస్యాస్పదమన్నారు.

CONGRESS

CONGRESS | దేవాలయాను అభివృద్ధి చేస్తాం : కొండా సురేఖ

రామగుండం నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Sureka) హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ట్రాంజెండర్స్‌కు ఇళ్ల స్థలాలు రామగుండంలో మంజూరు చేస్తున్నట్లు కొండ సురేఖ తెలిపారు.

CONGRESS | రామగుండంకు అధునాతన ఎస్సీ హాస్టల్ : అడ్లూరి లక్ష్మణ్

రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రాంతంలో అధునాతన ఎస్సీ (SC) హాస్టల్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. తాను చదువుకున్న స్థానిక జూనియర్ కళాశాల అధునాతనంగా పునర్నిర్మానం చేసేందుకు అండగా నిలుస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు అరకర వేణుగోపాల్, మినిమం వేజ్ చైర్మన్ జనప్రసాద్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ (Collector) కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, సింగరేణి జిఎం లలిత్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, యుగంధర్ పాల్గొన్నారు.

CLICK HERE TO READ సేవాభావానికి చిరునామ‌ వడ్డె ఓబన్న

CLICK HERE TO READ MORE

Leave a Reply