Condemned – గోవుల మ‌ర‌ణం అవాస్త‌వం – ప్ర‌క‌టించిన టిటిడి

తిరుపతి, : టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాద‌ని టిటిడి అధికారులు ప్ర‌క‌టించారు. మృతి చెందిన గోవులు పోటోలు టిటిడి గోశాలకు సంబంధించినవి కావ‌ని అన్నారు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు పోటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.. ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామ‌ని, ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టిటిడి అధికారులు భ‌క్తుల‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *