Community Hall | సార్ కాస్త పట్టించుకోండి..

కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : రెండవ వార్డు కట్టమైసమ్మ కృష్ణ నగర్‌లో సగంలోనే నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ సారించాల‌ని… కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే గణేష్‌ను కోరారు.

ఈ మేరకు శనివారం బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, స్థానిక మహిళలు కమ్యూనిటీ హాల్‌ను సందర్శించి.. క‌మిటీ హాల్ అర్ధాంతరంగా నిలిచిపోయి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిన‌ పరిస్థితిని పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం స్వర్గీయ ఎమ్మెల్యే సాయన్న ఈ ప్రాంత ప్రజా అవసరాల కోసం రూ.50 లక్షలు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించారని తెలిపారు.

తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కూడా… 18 లక్షల రూపాయలు కేటాయించారు, కానీ తగినంత నిధులు లేకపోవడంతో నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు.

ఈ బస్తీలో రోజువారీ వేతనాలపై ఆధారపడి జీవించే దాదాపు 600 కుటుంబాలు నివసిస్తున్నాయని.. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు ఎమ్మెల్యే గణేష్‌ను అభ్యర్థించారు.

Leave a Reply