committee | అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహ, రవీందర్ ఎన్నిక

committee | అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహ, రవీందర్ ఎన్నిక
committee | మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్)నారాయణపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా చంద్రకంటి నరసింహ, బొమ్మన్ పాడ్ రవీందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా విస్త్రుత స్థాయి సమావేశం షేర్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది.
జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కమిటీ(new committee) ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల అధికారిగా శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల పర్యవేక్షకులుగా వెంకట్ రెడ్డి, గుంపు బాలరాజ్ హాజరై ఎన్నికలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా బాధ్యులు 13 మండలాల(13 mandals) అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా నర్సింహా, రవిందర్ లను ఏకగ్రీవంగా(unanimously) ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ భావజాలం గల సంఘానికి జిల్లా బాధ్యులుగా ఎంపిక కావడం అదృష్టమని అన్నారు. అప్పగించిన బాధ్యతను సమర్ధంగా నిర్వహిస్తామని ఉపాధ్యాయులకు నిరంతరం అందుబాటులో ఉంటూ తపస్ సంఘ వికాసానికి నిరంతరం పాటుపడతామని వారు తెలిపారు. కాగా తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహ, రవీందర్ ఎంచుకోవడం పట్ల ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు.
