Comments | ట్రంప్‌కు కమల్ హాసన్ చురకలు

Comments | ట్రంప్‌కు కమల్ హాసన్ చురకలు

Comments | ట్రంప్ వ్యాఖ్యలపై కమల్ హాసన్ ఘాటు స్పందన
మీ పని మీరు చూసుకోండి’ అంటూ ఓపెన్ లెటర్
భారత్ సార్వభౌమ దేశమని స్పష్టం చేసిన కమల్ హాసన్
హార్మూజ్ జలసంధి మూసివేతతో చమురు సరఫరాపై ప్రభావం
27 దేశాల నుంచి 40 దేశాలకు చమురు దిగుమతులు విస్తరించిన భారత్

Comments | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షులు ట్రంప్ పై సినీ నటుడు కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా భారత్‌కు 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇవ్వడంతో కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి మీ పని మీరు చూసుకోండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. భారత్ సార్వభౌమ దేశమని, ఏ విదేశీ నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం మనకు లేదని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు.

దేశాల మధ్య పరస్పర గౌరవం ఉంటేనే ప్రపంచ శాంతి సాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం వల్ల హార్మూజ్ జలసంధి మార్గం ముసివేశారు. ఈ నేపథ్యంలో భారత్ తన చమురు దిగుమతులను 27 దేశాల నుంచి 40 దేశాలకు విస్తరించిందని, ఇంధన సరఫరా స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. భారత్ ఏ దేశం అనుమతి పైనా ఆధార పడలేదని అధికారులు తెలిపారు.

Leave a Reply