ఎంపీ అవినీతి ఏ స్థాయికి చేరిందో..?

ఎంపీ అవినీతి ఏ స్థాయికి చేరిందో..?
ఎంపీ అంటే మట్టి, పేకాట అని వాళ్ల ఎమ్మెల్యేనే చెప్పాడు
ప్రజాప్రతినిధుల అర్ధాన్నే మార్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
వారికి ప్రజా సమస్యలంటే అర్ధం తెలియదు
మాజీ మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎంపీ అంటే మట్టి, పేకాట అని వాళ్ల ఎమ్మెల్యేనే చెప్పాడంటే ఎంపీ అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చని మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కొటికలపూడిలో అకాలవర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, మునగ పంటలను పరిశీలించిన అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై మాజీ మంత్రి జోగి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధుల అర్థాన్నే మార్చేశారన్నారు. కేవలం దోచుకోవడానికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా మారారని ఎద్దేవా చేశారు. వారికి ప్రజా సమస్యలంటే అర్ధం తెలియదని విమర్శించారు. రైతు సమస్యలు వారి కంటికి కనిపించవన్నారు. అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోతే.. స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి అయినా వచ్చి రైతుల కష్టాలు చూశాడా? అని ప్రశ్నించారు.
