COLLECTOR| సైకిల్ పై కార్యాలయానికి రాక..

COLLECTOR| మచిలీపట్నం, ఆంధ్రప్రభ : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నివారణలో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్ కు ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ పై రావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ స్వయంగా కలెక్టరేట్ కు సైకిల్ పై జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పరిసరాల పరిశుభ్రత ద్వారానే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని వ్యాధులు దరి చేరవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నారని గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రహదారుల వెంబడి చెత్తాచెదారం పడవేయవద్దని, ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మూడవ శనివారం ఈ పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

Leave a Reply