TG |బీఆర్ఎస్ కుంభమేళాకు తరలిరండి.. బాల్క సుమన్

మందమర్రి, ఆంధ్రప్రభ : టిఆర్ఎస్ పురుడు పోసుకొని 25వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 27న ఎల్కతుర్తిలో తలపెట్టిన బహిరంగ సభ బీఆర్ఎస్ కుంభమేళాకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో రజతోత్సవ వేడుకల సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ… ఆదివారం 25వ వార్షికోత్సవ వేడుకలకు చెన్నూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని, గద్దెనెక్కి 17నెలలు గడిచినా హామీల అమలు మాత్రం జరగడం లేదన్నారు. మహిళలకు 2500 నెలకు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వడం లేదని, రూ.15వేల రైతు భరోసా అందడం లేదని, రూ.4వేల పింఛన్ అమలు కావడం లేదని, అలాంటి కాంగ్రెస్ సర్కార్ ను నిలదీయాలన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

Leave a Reply