COLONY | ఆదరించి గెలిపిస్తే సెంటర్ లైటింగుకు కృషి చేస్తా

COLONY | ఆదరించి గెలిపిస్తే సెంటర్ లైటింగుకు కృషి చేస్తా

పొనకల్ జీపీ సర్పంచి అభ్యర్థి సుష్మ భూమేష్

COLONY | జన్నారం, ఆంధ్రప్రభ : ఆదరించి గెలిపిస్తే సెంట్రల్ లైటింగుకు కృషి చేస్తానని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి కాంగ్రెస్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్ అన్నారు.జీపీ పరిధిలోని వినాయక నగర్, మేదరివాడ, రాంనగర్, గూల్లగూడెం, శ్రీలంక కాలనీ, గాంధీనగర్ వాడల్లో ఆదివారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో తన భర్త సర్పంచిగా చేసినప్పుడు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు.

ప్రస్తుతం రిజర్వేషన్ అనుకూలించినందున తాను సర్పంచిగా పోటీ చేశానని, తన ఉంగరం గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తే, గ్రామంలోని అన్ని సమస్యలను తమ సమస్యలుగా భావించి తీరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు మాజీ సర్పంచి జక్కు భూమేష్ గుప్తా, హన్మంతరావు,గుండ సుధాకర్, రాగుల శంకర్, అప్పని సాయి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply