College | మెరుగైన సదుపాయాలే లక్ష్యం

College | మెరుగైన సదుపాయాలే లక్ష్యం
- ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమ బోధన
- కలెక్టర్ సుమిత్ కుమార్
College | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని కన్నన్ కళాశాల ప్రాంగణంలో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న రెండు అంతస్థుల హాస్టల్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్తూరు నగరంలో కన్నన్ కళాశాలకు విశిష్టమైన చరిత్ర, గొప్ప గౌరవం ఉన్నాయన్నారు. ఆ గౌరవాన్ని మరింత పెంచేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు అవసరమని స్పష్టం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా విద్యాభ్యాసం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, చూడ చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజా నరసింహులు, కళాశాల పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.


