ఆంధ్రప్రభ భవానీపురం : విజయవాడ పశ్చిమ లోని జి.ఎన్.ఆర్.ఎంసి ప్రభుత్వ పాఠశాలలోనీ విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్న సుజనా ఫౌండేషన్, సీడ్స్ ఇంపాక్ట్ ఐ. ఓ .టీ ల్యాబ్ పట్ల ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి రామ రాజ్య నగర్, జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది ప్రారంభించిన ఐ ఓ టీ, ఏ ఐ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు విజయవంతంగా డిజిటల్ పద్ధతుల్లో పాటలను బోధిస్తున్నారు.
ఈ ఇన్నోవేషన్ ఐ ఓ టీ ల్యాబ్ గురించి తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీశా ఇటీవల ఆ పాఠశాలను సందర్శించి ల్యాబ్ ను పరిశీలించి సంతృప్తి చెందిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాలతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పీజీ ఆర్ ఎస్ కార్యక్రమం సందర్భంగా ఈ ఐఓటీ ల్యాబ్ ను ప్రదర్శించారు. సుజనా ఫౌండేషన్, సీడ్స్ ఇంపాక్ట్ సిబ్బంది జి.ఎన్.ఆర్ఎం సి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే ప్రదర్శించిన ఐ ఓ టీ ల్యాబ్ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు..
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్స్ ఫర్ గ్రోత్ త్రూ ఎంకరేజింగ్ ఇన్నోవేషన్స్ అనే లక్ష్యంతో జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుజనా ఫౌండేషన్, సీడ్స్ సంస్థల ద్వారా ఐఓటీ లాబ్ ఎలా ఉంటుంది, దానివల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయి, విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు అనే అంశం పై కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవ అభినందనీయ మన్నారు.

