Collector | విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు

Collector | విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు
- నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
Collector | ఊట్కూర్, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఈనెల 17న జిల్లాలో జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈనెల 17న జిల్లాలోని మక్తల్, మాగనూరు, కృష్ణ నర్వ ఊట్కూర్ మండలాలలో జరిగే ఎన్నికల విధులకు విధిగా హాజరు కావాలన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి హాజరు కాకపోతే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కఠినమైన చర్యలు ఉంటాయని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.
