బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘం…

బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘం…

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు. ఆదివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నిర్వహించిన జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగా జగ్జీవన్ రామ్ అనేక సేవలందించారని కొనియాడారు.

ఆయన సేవలు నేటితరం రాజకీయ నేతలకు ఆదర్శమని అన్నారు. పేదరికంలో పుట్టి ఒక ప్రధాని స్థాయి వరకు ఎదగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొని నివాళులర్పించారు.

Leave a Reply