నిలిచిన రాకపోకలు

ఖానాపూర్ రూరల్‌, ఆంధ్రప్రభ : నిర్మ‌ల్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వ‌ర్షాల‌తో ఖానాపూర్ మండలం లోని తర్లపాడు–కొమరం భీం చౌరస్తా రహదారిపై ఉన్న కల్వర్టు కూలిపోయింది (culvert damage). దీని కారణంగా రహదారి ఒక భాగం పూర్తిగా చెదిరిపోగా, వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

నిరంతర వర్షాల వలన నీటి ప్రవాహం పెరగడంతో కల్వర్టు కింద మట్టి కొట్టుకుపోయింది. రహదారి ప్రమాదకరంగా మారడంతో గ్రామస్తులు చెట్ల, కొమ్మలు, రాళ్లను రోడ్డుపై ఉంచి వాహనదారులకు హెచ్చరికలు ఇచ్చారు. ఈ మార్గం ద్వారా రోజువారీగా వందలాది వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply