Collapsed | పైలట్లు మృతి

Collapsed | పైలట్లు మృతి
Collapsed | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత వాయుసేనలో మరో గాఢ విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం కూలిపోయి ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి గురువారం సాయంత్రం బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్ సంబంధాలు తెగిపోయాయి.

తర్వాత గాలింపు చర్యల్లో విమానం జోర్హాట్కు 60 కి.మీ దూరంలోని కొండ ప్రాంతంలో కూలినట్లు గుర్తించారు. మృతులను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్గా ఐఏఎఫ్ అధికారికంగా గుర్తించింది. వీరి మృతికి వాయుసేన తీవ్ర సంతాపం తెలిపింది. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.
