Vikarabad | ఉదయం చలి… మధ్యాహ్నం వేడి
వికారాబాద్, జనవరి 30 (ఆంధ్రప్రభ): జిల్లాలో అత్యంత శీతల ప్రాంతంగా గుర్తింపు పొందిన వికారాబాద్ లో ఉదయం వేళలో చలితో ప్రజలు సతమతమవుతుండగా.. మధ్యాహ్నం ఎండ వేడిమితో మరింత ఇబ్బందులపాలవుతున్నారు. వికారాబాద్ సమీపాన ఉన్న అనంతగిరి గుట్ట అడవి నేపథ్యంలో రాత్రి వేళలో ఉదయం పూట చలిగా ఉంటుంది.. అదే మధ్యాహ్నానికి వస్తే ఎండకొడుతూ ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు.