సరిహద్దులో కాక్ ఫైట్

సరిహద్దులో కాక్ ఫైట్

  • జోరుగా పందాలు

వాజేడు, ఆంధ్రప్రభ : తెలంగాణ సరిహద్దు ప్రాంతం చత్తీగడ్(Chattigad) రాష్ట్రంలోని అన్నారం అటవీ ప్రాంతంలో జోరుగా కోడి పందాలు(chicken betting) నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో జరిగే ఈ కోళ్ళ సయ్యాటకు తెలంగాణ(Telangana) నుంచి కోడిపందెం వీరులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. చత్తీస్ గడ్ తెలంగాణ సరిహద్దులో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి.

తెలంగాణ ప్రాంతంలోని వాజేడు, పేరూరు, వెంకటాపురం, ఏటూరునాగారం(Vajedu, Peruru, Venkatapuram, Ethurunagaram), కన్నయ్య గూడెం, మంగపేట, మణుగూరు తదితర మండలాల నుంచి వాహనాల్లో అక్కడికి చేరుకొని కోడిపందాలలో పాల్గొంటున్నారు.

భారీ ఎత్తున జరిగే ఈ కాక్ ఫైట్ కు ఖాకీల సపోర్ట్ ఉన్నట్లు సమాచారం. వీరి జూదం(Gambling) అడ్డు అదుపు లేకుండా జరగడానికి తెలంగాణ పోలీసుల( Police)కు మంత్లీ ముడుపులు ముట్ట చెబుతున్నట్లు కోడిపందాల(Cock betting) నిర్వాహకులు చెప్పుకోవడం విశేషం.

సరిహద్దుల్లో ఖాకీల కాపలా ఉండడంతోటే జోరుగా జూదం జరుగుతోందని ప్రచారం కొండెక్కి కోడి కూస్తోందని జనం సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో కోడిపందాలకు అనుమతి లేకపోవడం పక్క రాష్ట్రం చత్తీస్‌గ‌డ్‌లోని తాళ్ల గూడెం, అన్నారం ప్రాంతంలో గురువారం ఆదివారం రోజుల్లో కోడిపందాలు జోరుగా నిర్వహిస్తున్నారు. కోడిపందాలు జరిగే విషయాన్నివాట్సాప్ గ్రూప్(Whatsapp Group) ఏర్పాటు చేసి నిర్వాహకులు ముందుగా సమాచారం(Information) అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

వాజేడు(Wajedu) మండలానికి చెందిన ఇద్దరు కన్నయ్యగూడం మండలానికి చెందిన ఒకరు చత్తీస్ గడ్ చెందిన మరొకరు ఈ కోడిపందాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత పోలీసులు కూడా కళ్లప్పగించి వ్యవహరించడంతో ఈ జూదం జోరుగా సాగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply