మాఘమాసం ప్రారంభం కావడంతో పెళ్లిలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున పెరిగిన బంగారం ధరలు ప్రజలకు, మహిళలకు షాక్ ఇచ్చాయి. గత రెండు నెలలుగా.. వరుసగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం కాస్త బ్రేక్ ఇచ్చాయి. కానీ సోమవారం మరోసారి బంగారం ధరలు పెరిగాయి. దీంతో నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 350 పెరగ్గా.. 22 క్యారెట్ల తులం బంగారం రూ.79,800 లకు చేరుకుంది.
అలాగే 24 క్యారెట్ గోల్డ్ పై రూ.390 పెరగడంతో.. తులం బంగారం 87,060కు చేరుకుంది. దీంతో చరిత్రలో మొదటిసారి బంగారం 87వేల మార్కును తాకింది. ఇదిలా ఉంటే ఈ రోజు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో కేజీ సిల్వర్ ధర రూ. 1,07,000గా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో నిత్యం పెరుగుతున్న బంగారం ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ప్రతి పెళ్లిలో బంగారం తప్పనిసరి కావడంతో ధర ఎంత పెరిగిన ప్రజలు కొనకమానడం లేదు. ఈ ధరలు ఇలానే పెరిగితే త్వరలోనే తులం బంగారం లక్ష రుపాయలకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.