andesri | అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి

అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో : తెలంగాణ మలి ఉద్యమంలో తన గళంతో పోరాటాలను ఉత్తేజిపరిచి… తెలంగాణ అనంతరం జయజయహే తెలంగాణ గీతాన్ని ప్రజలకు అంకింత చేసిన అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మోశారు. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘటకేష్ మున్సిపాలిటీ పరిధి ఎస్ఎఫ్సీ నగర్లో అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పలువురు మంత్రుల (Many ministers) తో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. చితి మీద పెట్టే ముందు సీఎం రేవంత్ రెడ్డి పాడిని మోశారు. తన గళంతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసిన అందెశ్రీ రుణాన్ని రేవంత్ రెడ్డి ఇలా తీర్చుకున్నారని పలువురు అన్నారు. నిన్న ఉదయం అందెలశ్రీ కన్నుమూసిన సంగతి విదితమే. అంతకు ముందు తార్నాక నుంచి ఉప్పల్ మీదుగా ఘుట్కేసర్ లోని ఎన్ఎఫ్సీ నగర్ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది.
