శరద్ పవార్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకులు శరద్ పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ అగ్ర నాయకుల భేటీలో పలు కీలక రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

