Football | ఫుట్‌బాల్ కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి

Football | ఫుట్‌బాల్ కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి
Football | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : సాధారణంగా ఏ ఆటగాడైనా క్రీడా మైదానం చూడగానే ఎక్కడ లేని ఉత్సహం వస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిన్న రాత్రి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ క్రీడా మైదానంలో ఫుట్ బాల్ (Football) ప్రాక్టీస్ చూసి ప్రజలే కాదు క్రీడాకారులు సైతం ఆశ్చర్యానందం వ్యక్తం చేస్తున్నారు.

సాకర్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ (Lionel Messi) పర్యటనపై అభిమానులు, క్రీడా రంగ ప్రముఖుల్లో ఆసక్తి మొదలైంది. ‘గోట్ ఇండియా టూర్’ (Goat India Tour) లో భాగంగా మెస్సీ హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియం వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ లో మెన్సీ ఆడనున్నాడు. ఆయనతో తలపడేందుకు సీఎం రెవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

అందుకోసం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఇతర ఫుట్ బాల్ క్రీడాకారులతో ప్రాక్టీస్ చేసిన సీఎం సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక కూడా గంటన్నరకు పైగా ఫుట్‌బాల్ ఆడారు. ఆటలో కనబరిచిన యాక్టివ్, రన్నింగ్ క్రీడాకారులను ఆశ్చర్యపర్చింది.

