CM Revanth | ఓట్లు అడిగే హక్కు లేదు….

CM Revanth | ఓట్లు అడిగే హక్కు లేదు….
CM Revanth | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీలకు లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో మహిళా సంఘాలకు(women’s groups) వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన మాజీ సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం ఎలాంటి పథకాలను అమలు చేయలేదని ఆరోపించారు. రెండు సంవత్సరాలలో మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు.
స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు .వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, డిఆర్డిఏ పీడీ సురేందర్, అడిషనల్ పీడీ విజయలక్ష్మి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాజమణి ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, పలువురు నాయకులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
