CM Cup Sports | చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి…

CM Cup Sports | చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి…
- అటహాసంగా సీఎం కప్ క్రీడలు ప్రారంభం…
CM Cup Sports | జైనూర్, ఆంధ్రప్రభ : యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు అన్నారు. ఈ రోజు కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జై నూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో రెండు రోజులపాటు నిర్వహించే సీఎం కప్ క్రీడలను చైర్మన్ తో పాటు జై నూరు సర్పంచ్ కొ డప ప్రకాష్, సిఐ రమేష్ అధికారులు హటహసంగా క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మండలంలోని అన్ని పంచాయతీల క్రీడాకారులతో మండల స్థాయి క్రీడలు సామరస్యంగా నిర్వహించాలని క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని వారన్నారు. ఈ సీఎం కప్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా స్థాయి క్రీడలకు ఎంపిక చేసి పంపించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఆడబీర్షావ్, మండల పంచాయతీ అధికారి భుఖ్య శశి కుమార్, మండల విద్యాశాఖ అధికారి మధుకర్ జాదవ్, ఉద్యోగులు ఉపాధ్యాయులు, నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
