CM Cup | సీఎం కప్ జిల్లా స్థాయి షటిల్ పోటీలు

CM Cup | సీఎం కప్ జిల్లా స్థాయి షటిల్ పోటీలు

  • అండర్–15, అండర్–19 విభాగాల్లో ఉత్సాహంగా టోర్నమెంట్
  • క్రీడలు విద్యార్థుల ఎదుగుదలకు దోహదపడతాయి
  • దమ్మోజు సతీష్ కుమార్, పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు

CM Cup | అచ్చంపేట, ఆంధ్రప్రభ : క్రీడల వల్ల విద్యార్థులల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత పెరుగుతుందని పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు దమ్మోజు సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ) మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ ఎడిషన్ ముఖ్యమంత్రి కప్–2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను మంగళవారం అచ్చంపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు.

జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–15, అండర్–19 బాలురు, బాలికల విభాగాల పోటీలను పబ్లిక్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మొత్తం 20 జట్లు పోటీపడ్డాయి. పోటీలను పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు దమ్మోజు సతీష్‌కుమార్, మాజీ అధ్యక్షులు వెన్ను శ్రీనివాసులు ప్రారంభించారు.

CM Cup |

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులలో ఏకాగ్రతతో పాటు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలిదీసేందుకు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు.

విద్యార్థులు గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించాలని, క్రీడలతో పాటు చదువుల పట్ల కూడా ఆసక్తి చూపాలని సూచించారు. విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతర సాధనతో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఈ నెల 19 నుంచి 26 వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వసంత్‌కుమార్ యాదవ్, లక్ష్మణ్ నాయక్, ఎం.పాండు, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే పబ్లిక్ క్లబ్ కార్యనిర్వాహక సభ్యులు బొప్పి అశోక్‌నాథ్, బాణాల సతీష్, బొబ్బిలి శ్రీను, గౌరవ సభ్యులు పిల్లి హరిచంద్ర, కటకం భాస్కర్, రామనాథం తదితరులు హాజరయ్యారు.

Leave a Reply