ఏపీ సీఎం చంద్రబాబు నేడి స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులకు తెలియజేశారు. శాసనసభ సమావేశాలు అనంతరం సభలో ఎటువంటి అర్థవంతమైన చర్చలు జరిగాయి, జరగబోయే సమావేశాలు ఎలా జరపాలి అన్న దానిపై సీఎంతో చర్చించాలని కోరారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు… అసెంబ్లీ స్పీకర్ ముఖ్యమంత్రి కంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నతుడని.. అందువల్ల, తానే స్వయంగా స్పీకర్ చాంబర్‌కు వెళ్లి ఆయనను కలుస్తానని అధికారులకు చెప్పారు.
అనడమే కాదు స్వయంగా వెళ్లి స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిసి ఆయన హోదాకు తగిన గౌరవం ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.